AP High Court: ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. 6 వారాల్లోపు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం!

AP High Court: ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు. ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం. బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.

Arun Chilukuri
Updated on: 1 Oct 2026 12:21 PM IST
AP High Court
X

AP High Court: ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. 6 వారాల్లోపు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం!

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీలు మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వ్యాజ్యాలపై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వు చేసిన ఉన్నత న్యాయస్థానం.. తాజాగా తన తుది ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా అంటే ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని (SEC) ఆదేశించింది.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఏ పరిస్థితుల్లోనైనా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదని స్పష్టం చేసింది.

'సర్' (SIR) ప్రక్రియ ముగిశాకే స్థానిక ఎన్నికలు జరపాలంటూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు తాజా ఆదేశాలతో ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గగం సుగమం కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.