Nandyal: నందికొట్కూరులో నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు!
Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో నూతన అదనపు కోర్టు భవనం ప్రారంభం.
Nandyal: నందికొట్కూరులో నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు!
నంద్యాల జిల్లా: నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూరు సీనియర్ సివిల్ మరియు జూనియర్ సివిల్ కోర్టుల సముదాయ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్ , జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి మరియు జస్టిస్ ఎ. హరి హర నాథ శర్మ శనివారం ముఖ్య అతిథులుగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా వారు నందికొట్కూరులో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 88 అదనపు కోర్టులను ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వగా ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 అదనపు కోర్టు భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నందికొట్కూరు సివిల్ మరియు జూనియర్ సివిల్ కోర్టుల సముదాయ ఆవరణంలో ఒక నూతన అదనపు కోర్టు భవన నిర్మాణం చేపట్టారు.
శనివారం నూతన భావనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త కోర్టు ల ఏర్పాటు కీలకంగా మారుతుందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ మర్యాదపూర్వకంగా కలిసి , పూల మెుక్కలను అందజేసి స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంబంతో స్వాగతం పలికారు. అనంతరం సర్వమత పార్దనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ప్రధాన నాయమూర్తి జి. కబర్థి, నందికొట్కూరు సివిల్ మరియు జూనియర్ సివిల్ జడ్జి లు, శోభ రాణి, దివ్య, ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ లు పాల్గొన్నారు.




