IAS Vikas Marmat: బెంగళూరు పబ్ వివాదం: ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు!

IAS Vikas Marmat: బెంగళూరు పబ్‌లో పోలీసులతో గొడవపడి దాడి చేసిన ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు.

Arun Chilukuri
Published on: 15 Oct 2026 11:43 AM IST
IAS Vikas Marmat: బెంగళూరు పబ్ వివాదం: ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు!
X

IAS Vikas Marmat: బెంగళూరు నగరంలో అర్థరాత్రి పబ్‌లో పోలీసులతో వివాదానికి దిగి, వారిపై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (KADA) సంచాలకుడిగా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం తక్షణమే బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇటీవల బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పబ్‌కు వెళ్లారు. పబ్ మూసివేసే సమయం దాటిపోయినా వారు అక్కడి నుంచి వెళ్లకుండా గడిపారు.

ఆ సమయంలో తనిఖీలకు వచ్చిన కబ్బన్ పార్క్ పోలీసు అధికారులు పబ్‌లో ఉన్న వారిని ప్రశ్నించారు. దీంతో తాను ఐఏఎస్ అధికారినని వికాస్ దురుసుగా సమాధానం ఇచ్చారు. పోలీసులు ఐడీ కార్డు చూపించాలని కోరగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన డ్యూటీలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నారు.

విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేసినందుకు కబ్బన్ పార్క్ పోలీసులు వికాస్ మర్మత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారం మీడియాలో సంచలనంగా మారడంతో స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆయన్ను కుప్పం కేడర్ నుంచి తొలగించి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.