AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు..
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వేగం పెంచింది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది. ఈ కుంభకోణానికి సంబంధించిన లింకులను చేధించే క్రమంలో ఈడీ అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఈడీ అధికారులు తాజాగా మరోసారి సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారాలపై ఆరా తీస్తున్న ఈడీ.. ఈ నెల 27వ తేదీన (బుధవారం) తమ ముందు విచారణకు హాజరుకావాలని జానకిలక్ష్మికి పంపిన నోటీసుల్లో స్పష్టం చేసింది. గతంలోనూ ఆమెకు ఒకసారి సమన్లు జారీ చేసిన అధికారులు, తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం ఈ కేసులో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసులో ప్రధానంగా ‘ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP’ (Pride Infracon LLP) కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు గట్టిగా దృష్టి సారించారు. ఈ కంపెనీతో వివాదాస్పద వ్యక్తి రాజ్ కసిరెడ్డికి ఉన్న సంబంధాలు, నడిచిన అంతర్గత లావాదేవీలపై ఈడీ పక్కా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ కంపెనీకి, అలాగే జానకిలక్ష్మికి షేర్ (వాటా) ఉందనే బలమైన అనుమానాలను ఈడీ వ్యక్తం చేస్తోంది. ఈ అక్రమ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడకు మళ్లిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నుంచి మళ్లీ సమన్లు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నెల 27న జానకిలక్ష్మి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హాజరైతే ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు గుప్పించబోతున్నారు, ఈ కేసు ఇంకెంతమంది పెద్దల మెడకు చుట్టుకోబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.




