AP Local Body Elections 2026: నేడు ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌.. జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఇవే

AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానుంది. 28 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 3:00 AM IST
AP Local Body Elections 2026
X

AP Local Body Elections 2026: నేడు ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌.. జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఇవే

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. దీంతో పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.

మరోవైపు రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు తేజ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీల వారీగా రిజర్వేషన్లను కేటాయించారు.

ఏ జిల్లాకు ఏ రిజర్వేషన్‌?

విశాఖ జిల్లా జడ్పీ చైర్మన్‌ పదవి బీసీకి కేటాయించారు. తిరుపతి ఎస్సీ మహిళకు, ఎన్టీఆర్‌ జిల్లా ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. కృష్ణా జిల్లా అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ప్రకాశం ఎస్సీకి, నెల్లూరు జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అయ్యాయి.

గుంటూరు, కోనసీమ జిల్లాలు ఎస్సీ మహిళలకు కేటాయించగా.. పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో అన్‌రిజర్వ్‌డ్‌ మహిళలకు అవకాశం కల్పించారు. పోలవరం ఎస్టీ మహిళకు, అల్లూరి జిల్లా ఎస్టీకి రిజర్వ్‌ చేశారు. అనకాపల్లి బీసీ మహిళకు, అనంతపురం బీసీ కేటగిరీకి కేటాయించారు.

అన్నమయ్య జిల్లా అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉండగా.. బాపట్ల, కాకినాడ జిల్లాలు అన్‌రిజర్వ్‌డ్‌ మహిళలకు కేటాయించారు. కర్నూలు బీసీకి, మార్కాపురం, నంద్యాల అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీల్లో ఉన్నాయి.

పార్వతీపురం మన్యం ఎస్టీ కేటగిరీకి రిజర్వ్‌ కాగా.. శ్రీసత్యసాయి అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు బీసీ మహిళలకు కేటాయించారు. పశ్చిమగోదావరి, కడప జిల్లాలు అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉన్నాయి.

చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో జడ్పీ చైర్మన్‌ పదవులు అన్‌రిజర్వ్‌డ్‌ మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్లతో పాటు బుధవారం వెలువడనున్న ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్