AP MPTC ZPTC Elections Polling: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌లో పలుచోట్ల ఉద్రిక్తతలు!
AP MPTC ZPTC Elections Polling: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తతలు. కడప, పల్నాడు, మన్యం జిల్లాల్లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు.
AP MPTC ZPTC Elections Polling: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌లో పలుచోట్ల ఉద్రిక్తతలు!
AP MPTC ZPTC Elections Polling: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ కడప, పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వర్గీయుల మధ్య భౌతిక దాడులు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ లోపల విధులు నిర్వహిస్తున్న టీడీపీ ఏజెంట్లను వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి బలవంతంగా బయటకు తోసివేసినట్లు ఆరోపణలు రావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రతిష్టాత్మక పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ఆర్.తుమ్మలపల్లి వద్ద కూడా టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా, పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కీసర పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రణరంగం సాగింది. టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో వైసీపీ వర్గీయులు దాడికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో ముగ్గురు టీడీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పెంచి ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.




