AP: సచివాలయ సిబ్బందిపై పోలీసుల దాడి, నిర్బంధాలు దుర్మార్గం: ఏపీ ఎన్జీవోస్
AP: సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఏపీ ఎన్జీవోస్ నేత ప్రభు: చర్చల ద్వారా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్.
AP: సచివాలయ సిబ్బందిపై పోలీసుల దాడి, నిర్బంధాలు దుర్మార్గం: ఏపీ ఎన్జీవోస్
AP: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసులు దాడి చేయడం, నిర్బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపి ఎన్జీవోస్ నేత ప్రభు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి పోలీసులను ప్రయోగించడం బాధాకరమన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్న సచివాలయ ఉద్యోగుల పట్ల ఇలాంటి వైఖరి సరికాదని పేర్కొన్నారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం నిరసన తెలిపే ఉద్యోగులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఉద్యోగులపై జరిగిన పోలీసుల చర్యలను ప్రభుత్వం వెంటనే సమీక్షించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు చేపట్టే ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను అడ్డుకోవడం దురదృష్టకరమని, ఉద్యోగులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చేయాలని ఉద్యోగ సంఘం నేత ప్రభు కోరారు.




