New Pensions: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా 3 లక్షల పింఛన్లు, సెప్టెంబర్‌లోనే దరఖాస్తుల స్వీకరణ!
New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 లక్షల పింఛన్ల అందజేతకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
New Pensions: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా 3 లక్షల పింఛన్లు, సెప్టెంబర్‌లోనే దరఖాస్తుల స్వీకరణ!
New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు కార్యాచరణను పూర్తి చేశారు.
ప్టెంబరు రెండో వారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబరులో దరఖాస్తుల వడపోత, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, అక్టోబరు నుంచి అర్హులకు కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నారు.
మొదటి ప్రాధాన్యంగా వితంతువులు, వృద్ధులకు ఈ పింఛన్లు అందజేయనున్నారు. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపదికన ప్రాథమికంగా 1.50 లక్షల మంది వితంతువులు, 1.50 లక్షల మంది వృద్ధులను గుర్తించినట్లు సమాచారం.
చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వృత్తిపరమైన పింఛన్ల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ కేటగిరీల వారితో పాటు దివ్యాంగులకు తదుపరి విడతల్లో ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేయనున్నారు.




