ఏపీ రాజ్యసభ ఎలక్షన్స్: లిస్ట్‌లో తమిళనాడు సింగం అన్నామలై.. జనసేన కోటాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్?

AP Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కసరత్తు పూర్తి చేసింది.

Arun Chilukuri
Published on: 20 May 2026 4:41 PM IST
AP Rajya Sabha Elections
X

ఏపీ రాజ్యసభ ఎలక్షన్స్: లిస్ట్‌లో తమిళనాడు సింగం అన్నామలై.. జనసేన కోటాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్?

AP Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టి ప్రచారం సాగుతోంది. త్వరలోనే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి అభ్యర్థుల జాబితా ఆసక్తి రేపుతోంది.

ఎన్డీఏ (NDA) కూటమి ఒప్పందంలో భాగంగా పొత్తులో ఒక స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ.. తమ అభ్యర్థిగా అనూహ్యమైన పేరును తెరపైకి తెచ్చింది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత కె.అన్నామలైని ఏపీ కోటా నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్ఠానం దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు స్పష్టమైన సమాచారం అందినట్లు వినికిడి.

మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనుంది. టీడీపీ తరఫున రేసులో ఉన్న ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.

సానా సతీశ్: ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈయనకు మరోసారి రెన్యూవల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

వర్ల రామయ్య: ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే సీనియర్ నేత వర్ల రామయ్య పేరును ఖరారు చేసే ఛాన్స్ ఉంది.

యనమల రామకృష్ణుడు: బీసీ వర్గానికి కేటాయించాలని భావిస్తే సీనియర్ మోస్ట్ లీడర్ యనమల పేరు పరిశీలనలో ఉంది.

భాష్యం రామకృష్ణ: భాష్యం విద్యాసంస్థల అధినేత కూడా ఈసారి సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఎంఏ షరీఫ్: ముస్లిం మైనారిటీ కోటాలో అవకాశం ఇవ్వాలని అనుకుంటే, ప్రస్తుతం ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న షరీఫ్ పేరు తెరపైకి రావచ్చు.

జనసేన కోటా స్థానానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ సీనియర్ నేత లింగమనేని రమేశ్ పేరు బలంగా వినిపించినప్పటికీ, చివరి నిమిషంలో సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేసులోకి మరో ఇద్దరు అనూహ్యంగా వచ్చారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహరావుతో పాటు, టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న ఒక ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్‌ను జనసేన తరఫున రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరనేది ఇప్పుడు టాలీవుడ్, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చివరి నిమిషంలో అధిష్ఠానం పెద్దలు ఏవైనా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప.. దాదాపు పైన పేర్కొన్న పేర్లతోనే ఏపీ కూటమి రాజ్యసభ తుది జాబితా అధికారికంగా వెలువడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story