School Holiday: ఏపీలో బుధ, గురవారం రెండ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. కారణం ఇదే!

School Holiday: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4, 5 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2026 1:40 AM IST
School Holiday
X

School Holiday: ఏపీలో బుధ, గురవారం రెండ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. కారణం ఇదే!

School Holiday: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 4, 5 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టింది.


నవంబర్ 5న MPTC, ZPTC ఎన్నికల పోలింగ్


రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 4వ తేదీని పోలింగ్‌కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల కోసం కేటాయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాలు, ఇతర అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించింది. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


AP MPTC, ZPTC Elections 2026: సెలవుల వివరాలు


ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సంబంధిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు వర్తించనున్నాయి.


- నవంబర్ 4: పోలింగ్ ఏర్పాట్ల కోసం సెలవు.

- నవంబర్ 5: MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ సందర్భంగా సెలవు.

- నవంబర్ 7: ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు సెలవు.


ఎన్నికలు లేని ప్రాంతాల్లో సెలవు ఉండదా?


MPTC, ZPTC ఎన్నికలు జరగని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవులు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే సెలవులు వర్తిస్తాయి.

అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు తమ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుని సెలవులపై స్పష్టత పొందాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్