AP Gram Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ కీలక నిర్ణయం.. అభ్యర్థులకు ప్రత్యేక భద్రత!
AP Gram Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్‌చంద్ర పునేఠా కీలక సమీక్ష నిర్వహించారు.
AP Gram Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ కీలక నిర్ణయం.. అభ్యర్థులకు ప్రత్యేక భద్రత!
AP Gram Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్‌చంద్ర పునేఠా కీలక సమీక్ష నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్రంలోని 12 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశం అనంతరం ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల భద్రతపై కీలక వివరాలు వెల్లడించారు. ‘‘ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు నుంచి రాయలసీమ వరకు కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమస్యాత్మక 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడాం. పంచాయతీ ఎన్నికల సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాం. నామినేషన్ల సమర్పణకు వెళ్లేటప్పుడు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్ కావాలని కోరితే కల్పిస్తాం. తమకు దాడి ముప్పు ఉందని అభ్యర్థులు స్థానిక ఎస్పీకి చెప్తే, వారికి ప్రత్యేక భద్రత కల్పిస్తారు’’ అని స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎస్‌ఈసీ వివరించారు. పంచాయతీరాజ్ శాఖలో నిన్న కొత్త జీవో జారీ అయిందని, ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహక నిధులు అందిస్తుందని తెలిపారు.
5 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలు: ఏకగ్రీవం అయితే రూ. 15 లక్షల ప్రోత్సాహక నిధులు అందుతాయి.
5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలు: ఏకగ్రీవం అయితే రూ. 25 లక్షల ప్రోత్సాహక నిధులు వస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 నుంచి 20 శాతం గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు.




