TDP Rajya Sabha Candidates: టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన చంద్రబాబు.. రేపే నామినేషన్లు!
TDP Rajya Sabha Candidates: ఆంధ్రప్రదేశ్ టిడిపి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది. చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణల పేర్లను సీఎం చంద్రబాబు అధికారికంగా ఖరారు చేశారు.
TDP Rajya Sabha Candidates: టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన చంద్రబాబు.. రేపే నామినేషన్లు!
TDP Rajya Sabha Candidates: ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరనే సస్పెన్షన్ వీడింది. సుధీర్ఘ చర్చల తర్వాత పార్టీ నుంచి ముగ్గురు నేతల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. చింతకాయల విజయ్ , సానా సతీష్ , భాష్యం రామకృష్ణ పేర్లను అధికారికంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో ముగ్గురు అభ్యర్థులు భేటీ అయ్యిన తర్వాత వారికి బీఫారాలు అందించారు.
రాజ్యసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించి ఏపీ గళం వినిపించాలని సూచించారు. రేపు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రాజ్యసభ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుజ్జగిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని.. సరైన సమయంలో తగిన గుర్తింపు కల్పిస్తామని పల్లా హామీ ఇచ్చారు.




