Irumudi Movie: ‘ఇరుముడి’ సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించాలి.. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్

Irumudi Movie: ఇరుముడి’ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తక్షణమే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Updated on: 25 Aug 2026 5:29 PM IST
Irumudi Movie
X

Irumudi Movie: ‘ఇరుముడి’ సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించాలి.. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్

Irumudi Movie: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా రూపొందించిన ‘ఇరుముడి’ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది. ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

సినిమా అనేది సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అత్యంత శక్తిమంతమైన మాధ్యమమని, తెరపై చూపించే పాత్రలు సమాజంలో బలమైన ముద్ర వేస్తాయని నాయకులు పేర్కొన్నారు. "ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన అంశాలను సినిమాలో చూపించేటప్పుడు దర్శకులు, నిర్మాతలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. కానీ 'ఇరుముడి' చిత్రంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను అత్యంత ప్రతికూలంగా చిత్రీకరించడం శోచనీయం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో చూపించిన సన్నివేశాలు కేవలం కల్పిత పాత్రకే పరిమితం కాలేదని, స్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్ పాఠశాల పేరును ఉపయోగిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ధరిస్తున్న యూనిఫామ్‌లోనే పాత్రలను చూపించారని తెలిపారు. ఈ తరహా చిత్రీకరణ ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను తీవ్రంగా కించపరిచేలా ఉందని, తక్షణమే సదరు సన్నివేశాలను సినిమా నుండి తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story