Weather Update: ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మాత్రం మళ్లీ వడగాలుల ముప్పు!
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం! ఏపీలో ద్రోణి ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, విశాఖల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. తెలంగాణలో మాత్రం ఎండలు, వడగాలులతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Weather Update: ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మాత్రం మళ్లీ వడగాలుల ముప్పు!
Weather Update: ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ చల్లటి కబురు అందించింది. వాతావరణంలో వచ్చిన అకస్మాత్తు మార్పులతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. విదర్భ, తెలంగాణ దక్షిణ కోస్తా వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, విశాఖలో భారీ నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలకిపాటి వర్షాలు పడుతాయని. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరో వైపు తెలంగాణలో రుతుపవనాల ప్రభావం కనిపించకుండా పోయింది. వాతావరణం వేసవిని తలపిస్తుంది. అడపాదడప పడుతున్న వానలతో రైతులు ఇబ్బందులు పడుతున్నరు. పలు జిల్లాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిపాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.




