Nara Lokesh: మాట నిలబెట్టుకున్న లోకేష్.. చిన్నారికి కొత్త జీవితం

Nara Lokesh: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల జీన్ థెరపీ ఇంజెక్షన్‌తో ప్రాణదానం. చికిత్స బాధ్యత తీసుకున్న మంత్రి నారా లోకేష్.

Hari Kishan  AP Bureau Chief
Published on: 19 April 2026 8:23 AM IST
Nara Lokesh
X

Nara Lokesh: మాట నిలబెట్టుకున్న లోకేష్.. చిన్నారికి కొత్త జీవితం

Nara Lokesh: కొన్ని నెలలుగా మీడియా, సోషల్ మీడియాలో “సేవ్ పునర్విక” అంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. లక్షలాది మంది స్పందించి తమవంతు సాయం అందించగా, మరికొందరు ప్రార్థనలతో మద్దతు తెలిపారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్ కోసం విరాళాలు వెల్లువలా వచ్చాయి. ఇంకా అవసరమైన నిధుల సమీకరణలో మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చి పూర్తి బాధ్యత తీసుకున్నారు. అవసరమైనంత సాయం అందిస్తానని హామీ ఇచ్చి, ఆ మాటను నిలబెట్టుకున్నారు....

పునర్వికకు అవసరమైన చికిత్స కోసం విదేశాల నుంచి రూ.16 కోట్ల విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ రప్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. చికిత్స సమయంలో కూడా ఆయన ఆసుపత్రిలోనే ఉండి చిన్నారికి మద్దతుగా నిలిచారు. ప్రజల ఆశీస్సులతో చిన్నారి ఆరోగ్యం మెరుగుపడుతుండగా, ఆమె చిరునవ్వు తిరిగి కనిపించడం కుటుంబానికి ఆనందం కలిగించింది..

అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు ఈ చికిత్స ప్రాణాధారంగా నిలిచింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో అమెరికా నుంచి తెప్పించిన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్‌ను వైద్యులు మంత్రి లోకేష్ సమక్షంలో అందించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వైద్యులతో చికిత్స వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి ఆరోగ్యం పట్ల అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

*రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే ఆశ*

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. తండ్రి సురేష్ కుమార్ సాధారణ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కుటుంబానికి ఈ ఖరీదైన చికిత్స భారం అయ్యింది. మొదట స్థానికంగా చికిత్స చేయించినా, తరువాత హైదరాబాద్‌లో పరీక్షలు చేయించగా SMA Type-1 అని నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ మాత్రమే పరిష్కారమని వైద్యులు సూచించారు.

*మాట నిలబెట్టుకున్న లోకేష్*

సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో దాతలు ముందుకు వచ్చి కోట్ల రూపాయలు సమకూర్చారు. అయినప్పటికీ పూర్తి మొత్తానికి లోటు ఉండడంతో కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్‌ను ఆశ్రయించారు. ఆయన తక్షణమే స్పందించి చిన్నారి చికిత్స బాధ్యత తీసుకున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి చికిత్స విజయవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు.

*చికిత్స ప్రక్రియలో నిరంతర పర్యవేక్షణ*

ఇంజెక్షన్ దిగుమతి ప్రక్రియ నుంచి ఆసుపత్రి సమన్వయం వరకు ప్రతి దశలో మంత్రి లోకేష్ కార్యాచరణను పర్యవేక్షించారు. ఔషధ సంస్థలు, వైద్యులు, సంబంధిత అధికారులు కలిసి పనిచేసేలా సమన్వయం చేశారు. అవసరమైన పత్రాలు, చెల్లింపులు, రవాణా ఏర్పాట్లు సమయానికి పూర్తి కావడంతో చికిత్స ఆలస్యం లేకుండా పూర్తయ్యింది.

*ఇది నిజమైన పునర్జన్మే*

పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగంతో స్పందిస్తూ, తమ చిన్నారికి కొత్త జీవితం దక్కిందని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయం జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. తమకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి, వైద్యులకు, దాతలకు, ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంఘటన మానవత్వం, సహకారం, నాయకత్వం కలిసొచ్చినప్పుడు అసాధ్యమేమీ లేదని మరోసారి నిరూపించింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story