Markapur: మార్కాపురంలో మే 4న వైకాపా భారీ సమావేశం.. ఏర్పాట్ల పరిశీలన

Markapur: మార్కాపురంలో మే 4న జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 April 2026 3:55 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో మే 4న వైకాపా భారీ సమావేశం.. ఏర్పాట్ల పరిశీలన

Markapur: మార్కాపురం పట్టణంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 4వ తేదీన నిర్వహించనున్న ముఖ్య సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, అలాగే కృష్ణా జలాల పంపిణీ అంశాలపై విస్తృత చర్చ జరగనుంది.

ఈ నేపథ్యంలో మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్‌లో జరుగనున్న సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ అన్నా రాంబాబు, అన్నా కృష్ణ చైతన్య మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా సూచనలు చేశారు. సభ విజయవంతం చేయడానికి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story