Chirala: ఆటోలో మరిచిన బ్యాగ్ అప్పగించిన డ్రైవర్ నిజాయితీ!
Chirala: చీరాలలో ఆటోలో మరిచిపోయిన ల్యాప్‌టాప్, సర్టిఫికెట్ల బ్యాగ్‌ను పోలీసుల సహకారంతో బాధితురాలికి అందజేసి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ బాజీ.
Chirala: ఆటోలో మరిచిన బ్యాగ్ అప్పగించిన డ్రైవర్ నిజాయితీ!
చీరాల: ఆటోలో ప్రయాణించిన యువతి మరిచిపోయిన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను యజమానికి క్షేమంగా అందేలా చేసి ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు.వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంకు చెందిన స్రవంతి దేశాయిపేట సమీపంలో ఆటోలో ప్రయాణించి చీరాల దిగింది.దిగిన అనంతరం తన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయింది.బ్యాగ్‌లో ల్యాప్‌టాప్‌తో పాటు ఒరిజనల్ స్టడీ ధ్రువపత్రాలు,ఆధార్ కార్డులతో పాటు ఖరీదైన ల్యాప్ టాప్ తదితర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి.బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే వన్ టౌన్ పోలీసులను బాధిత యువతి ఆశ్రయించటంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన పోలీసులు సమాచారం ను ఆటో యూనియన్ వాట్సాప్ గ్రూప్‌లో వివరాలు పోస్టు చేయించారు.ఈ పోస్టును గమనించిన చీరాల సంపత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ తన ఆటోను పరిశీలించగా బ్యాగ్ అందులోనే ఉండటం గుర్తించాడు. ఆలస్యం చేయకుండా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు.పోలీసులు బ్యాగ్‌లోని వస్తువులను ధృవీకరించి యజమాని స్రవంతికి అప్పగించారు.
విలువైన ల్యాప్‌టాప్,ఒరిజనల్ స్టడీ ధ్రువపత్రాలు ఉన్న బ్యాగ్‌ను నిజాయితీతో అప్పగించిన ఆటో డ్రైవర్ షేక్ బాజీ ని ఒకటో పట్టణ సిఐ సోమశేఖర్,ఎస్సై రాజ్యలక్ష్మి అభినందించారు. డ్రైవర్ ఆయన సేవాభావంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




