Chirala: మహిళల రక్షణకు ‘శక్తి’ కవచం: బెల్ట్ ఫ్యాక్టరీలో చీరాల పోలీసుల అవగాహన సదస్సు!
Chirala: బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు ఎంఎస్బీ బెల్ట్ ఫ్యాక్టరీ మహిళా కార్మికులకు శక్తి యాప్, సైబర్ క్రైమ్ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 112, 181, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగాన్ని వివరించారు.
Chirala: మహిళల రక్షణకు ‘శక్తి’ కవచం: బెల్ట్ ఫ్యాక్టరీలో చీరాల పోలీసుల అవగాహన సదస్సు!
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పి ఎం.డి.మోయిన్ సూచనలతో చీరాల రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా చీరాల రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తోటవారిపాలెం MSB బెల్ట్ ఫ్యాక్టరీ లో చీరాల శక్తి బృందం ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. చీరాల రూరల్ సీఐ, ఎస్‌ఐ మరియు సిబ్బందితో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు ఫ్యాక్టరీలో పని చేసే మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి మహిళా తమ మొబైల్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఇది తక్షణ రక్షణ కవచంలా పనిచేస్తుందని అవగాహన కల్పించారు.
సదస్సులో భాగంగా అత్యవసర సమయాల్లో సంప్రదించవలసిన కీలక నెంబర్లైన 112 (పోలీస్), 181, 1091 (మహిళా హెల్ప్‌లైన్), మరియు 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్) గురించి వివరించారు. అలాగే సైబర్ నేరాల బారిన పడకుండా 1930 నెంబర్‌ను, మాదకద్రవ్యాల నివారణకు 1972 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పోక్సో (POCSO) చట్టంపై అవగాహన కల్పిస్తూనే, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి వివరించారు. రోడ్డు భద్రతపై 'శిరోరక్ష-ప్రాణరక్ష' కార్యక్రమంలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. మహిళలు మరియు విద్యార్థినులు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసులకు తెలియజేయాలని, సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే నేరాలు తగ్గుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.




