Chittoor: బోల్తా పడ్డ లిక్కర్ వ్యాన్.. లుంగీల్లో మద్యం లూటీ!
Chittoor: చిత్తూరు జిల్లాలో మందుబాబుల చేతికి జాక్‌పాట్ తగిలింది. మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో రోడ్డుపై పడ్డ మద్యం సీసాలను స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు పోటీ పడి మరీ దోచుకెళ్లారు.
Chittoor: బోల్తా పడ్డ లిక్కర్ వ్యాన్.. లుంగీల్లో మద్యం లూటీ!
Chittoor: చిత్తూరు జిల్లాలో లిక్కర్ లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. చిత్తూరు-పుత్తూరు మార్గంలో బసిరెడ్డిపల్లి సమీపం ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వ్యాన్ లో తరలిస్తున్న మద్యం సీసాలు, బాక్సులో రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే కొందరు మద్యం బాక్సులు ఎత్తుకుపోయారు. మరికొందరు లుంగీలు, టవళ్లలో మద్యం సీసాలు వేసుకొని దోచుకెళ్లారు. సీసాల కోసం ఎగబడిన వారిలో మహిళలు సైతం ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అంతా సర్దుకుపోయారు. అంతా ఎత్తుకుపోగా కొన్ని మద్యం సిసాలు మిగిలిపోయాయి.
Next Story




