Rajamahendravaram: మంత్రి చేతుల మీదుగా '1/3' సాంగ్ రిలీజ్.. చిన్న సినిమాకు పెరిగిన క్రేజ్!
Rajamahendravaram: రాజమహేంద్రవరంలో '1/3' సినిమా సాంగ్‌ను విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్. చిన్న చిత్రాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టీకరణ.
Rajamahendravaram: మంత్రి చేతుల మీదుగా '1/3' సాంగ్ రిలీజ్.. చిన్న సినిమాకు పెరిగిన క్రేజ్!
తూర్పుగోదావరి జిల్లా: స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ, సరికొత్త సామాజిక సందేశంతో తెరకెక్కిన ‘1/3’ (వన్ బై థర్డ్) చలనచిత్రం చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను బుధవారం ఉదయం రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేశారు. 'శబరి మ్యూజిక్' యూట్యూబ్ ఛానల్ ద్వారా బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ పాట ప్రేక్షకుల ముందుకు వస్తుందని.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న చిత్రాల మనుగడకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు.
"పరిశ్రమకు కొత్త రక్తం, కొత్త ఆలోచనలు ఎంతో అవసరం. '1/3' లాంటి వైవిధ్యభరితమైన కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి, ఇందులో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టాలీవుడ్‌లో మరిన్ని మంచి అవకాశాలు రావాలి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ‘యూనివర్సల్ మెసేజ్’తో కూడిన మంచి చిత్రం అని రంపచోడవరం చెందిన గిరిజన యువకుడు, చిత్ర దర్శకుడు సాయి మహేష్ తెలియజేశారు.. ఈ చిత్రాన్ని ఒక బలమైన సోషల్ మెసేజ్‌తో రూపొందించామని, సమాజంలోని అన్ని వర్గాల, అన్ని వయసుల ప్రేక్షకులను ఆలోచింపజేసే ఒక 'యూనివర్సల్ పాయింట్' ఇందులో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా వినోదాత్మకంగా ఈ కథను తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.
గోదావరి పరిసరాల్లో నిర్మాణం.. త్వరలోనే థియేటర్లు, OTTల్లో విడుదల.
చిత్ర సహ దర్శకుడు డి.ఎస్.ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే సంకల్పంతో సరికొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు మనోహరమైన ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ జరిపినట్లు వెల్లడించారు. సాంకేతిక నిపుణులైన వినోద్ (కెమెరామెన్), అసద్.జె (మ్యూజిక్ డైరెక్టర్), డా,శ్యామ్ కుమార్.పి (ఎడిటింగ్, డి.ఐ, ఎస్‌ఎఫ్‌ఎక్స్ ఫిలిం స్టూడియో) ల అద్భుతమైన సహకారంతో ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని వివరించారు.
త్వరలోనే ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లతో పాటు, ఒక ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మంచి చిత్రాలను గుండెల్లో పెట్టుకునే తెలుగు ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని ఆదరిస్తారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నటులు మహేశ్ తేజ, వెంకటేష్ ముత్యాల, దీపక్, నాని తదితరులు పాల్గొని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.




