AP: తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్!
AP: ఈసీఐ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు, 'సర్' పేరుతో తొలగించిన ఓట్ల పునరుద్ధరణకు అక్టోబర్ 10న గ్రామాల్లో నిరసనలు చేపట్టాలని సంఘాలు పిలుపునిచ్చాయి.
AP: తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్!
AP: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అప్రజాస్వామిక వైఖరికి, సర్ పేరుతో 13.8 కోట్ల మంది ఓటర్ల తొలగింపుకు వ్యతిరేకంగా, జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, సర్ పేరుతో తొలగించిన ఓట్లు అన్నింటిని పునరుద్ధరించాలని, ఫారం-6 లో చేసిన సవరణలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, AP రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా అక్టోబర్ 10వ తేదీ గ్రామ, గ్రామాన నిరసనలకు పిలుపు ఇచ్చాయి.
అఖిల భారత సంఘాలు ఇచ్చిన పిలుపును విస్తృతంగా గ్రామాలు, నివాస ప్రాంతాలలో నిర్వహించాలని కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులను క్షేత్రస్థాయిలో భాగస్వాములను చేయాలని, జిల్లాలలో ఎక్కువ గ్రామాలలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగేలా కృషి చేయాలని పిలుపు నిచ్చాయి.
మిగిలిన వారందరూ విస్తృతంగా గ్రామాలలో జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని, సర్ పేరుతో తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని, కొత్త ఓటర్ల నమోదుకు వినియోగించే ఫారం - 6 లో చేసిన మార్పులను రద్దు చేయాలని, ఎన్నికల సంఘం నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడుగా ఉండే కమిటీని పునరుద్ధరించాలని కోరుతూ ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రలను ప్రజలకు వివరిస్టు, ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలనీ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు నిచ్చాయి..
ఈ కార్యక్రమంలో CITU జిల్లా. అధ్యక్ష కార్యదర్శులు ZP శ్రీనివాసులు,GL నరసింహ,AP రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి A హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే వెంకటేష్,CITU జిల్లా ఉపాధ్యక్షుడు C రామకృష్ణ, CITU నాయకులు పైపల్లి గంగాధర్, సాంబ, రఫీ తదితరులు పాల్గొన్నారు.




