Bobbili: రెండు రోజుల్లో కోళ్ల షెడ్డు తొలగిస్తాం.. కమిషనర్ రామలక్ష్మి
Bobbili: బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో జనావాసాల మధ్య కోళ్ల ఫారం నిర్మాణంపై సిఐటియు నేత శంకర్ రావు ఆగ్రహం.
Bobbili: రెండు రోజుల్లో కోళ్ల షెడ్డు తొలగిస్తాం.. కమిషనర్ రామలక్ష్మి
Bobbili: బొబ్బిలి మున్సిపాలిటీ లో వందలాది నివాసాలతో నిర్మించిన ఇందిరమ్మ కాలనీలో ఈ మధ్యకాలంలో కొందరు కోళ్ల ఫారం ను నిర్మిస్తున్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శంకర్ రావు ని ఆశ్రయించిన ఇందిరమ్మ కాలనీ నివాసితులు ఆయన ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మికి ధరకాస్తు రూపంలో తెలియపరిచారు.
ఈ విషయమై శంకర్రావు మాట్లాడుతూ కోళ్ల ఫారాలు అనేది జనావాసానికి సుమారు మూడు కిలోమీటర్ దాటి ఉండాలని ఈ లోపు ఉంటే ప్రజలు అనారోగ్య పాలవుతారని ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కొందరు వారి యొక్క ఆర్థిక రాజకీయ బలంతో జనావాస మధ్యలో ఈ కోళ్ల ఫారం షెడ్ ని నిర్మిస్తున్నారని ఇది చట్టరీత్యా నేరమని,
ఆయన మున్సిపల్ కమిషన్ కి తెలిపారు. అయితే వెంటనే మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి స్పందిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి వ్యాపారాలను ప్రభుత్యం అంగీకరించడని, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలోకోళ్ల ఫారం ను తొలగిస్తానని సదరు ఇందిరమ్మ కాలనీ స్థానిక నివాసులకు భరోసా ఇచ్చారు.




