Polavaram: రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం.. గిరిజనులకు ₹5కే భోజనం!
Polavaram: రంపచోడవరం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రారంభించారు.
Polavaram: రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం.. గిరిజనులకు ₹5కే భోజనం!
పోలవరం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అన్నా క్యాంటీన్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్‌ను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్యాంటీన్‌కు వచ్చిన ప్రజలకు టోకెన్లు పంపిణీ చేసి స్వయంగా భోజనాన్ని వడ్డించారు.
రాష్ట్రంలో సుమారు 62 అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించబడుతున్న నేపథ్యంలో, నిరుపేదలకు కేవలం ₹5కే పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి, ముఖ్యంగా చింతూరు ఐటిడిఏకు వివిధ పనుల నిమిత్తం వచ్చే గిరిజనులకు ఈ అన్నా క్యాంటీన్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రంపచోడవరం నియోజకవర్గానికి రెండు అన్నా క్యాంటీన్‌లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా, వెంటనే ఆమోదం తెలిపినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్ల సునీత, మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు, అలాగే 12 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




