Chandrababu: 50 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి కుంభకోణం చూడలేదు.. గ్రూప్-1పై చంద్రబాబు ఫైర్!

Chandrababu: గ్రూప్-1 స్కామ్‌పై ఎల్లుండి అసెంబ్లీలో ఆధారాలు పెడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2026 3:16 PM IST
Chandrababu
X

Chandrababu: 50 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి కుంభకోణం చూడలేదు.. గ్రూప్-1పై చంద్రబాబు ఫైర్!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలు, గ్రూప్-1 నియామకాల కుంభకోణం మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తన 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో గ్రూప్-1 తరహా కుంభకోణాన్ని ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ స్కామ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు మరియు వాస్తవాలను ఎల్లుండి అసెంబ్లీ వేదికగా సభ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. "గొడ్డలి పార్టీ స్వార్థం వల్లే ఎంతోమంది నిరుద్యోగ యువత బలయ్యారు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఆత్మాభిమానంతో రోడ్డెక్కడం సహజమని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు ఆ నియామకాలతో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉందని తెలిపారు.

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేటి నుంచి విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక కొత్త అధ్యాయమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురంలో విజయవంతంగా ల్యాండ్ కావడం ద్వారా రాష్ట్రంలో నూతన కనెక్టివిటీ శకం ప్రారంభమైందన్నారు. భోగాపురం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి రంగాలు మరింత పురోగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story