CM Chandrababu: ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్.. బాబు సరికొత్త లక్ష్యం!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ప్రారంభించారు.
CM Chandrababu: ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్.. బాబు సరికొత్త లక్ష్యం!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ (Artificial Intelligence), క్వాంటం కంప్యూటింగ్, వైజర్ డేటా సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వేదికగా గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను (1S, 1Q) ఆయన జాతికి అంకితం చేశారు.
కీలక ప్రకటనలు:
ఈ ఏడాది డిసెంబరు నుంచి అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' పనులు ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను (One Family One Entrepreneur) తయారు చేయడంతో పాటు, ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్‌ను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఐఐటీ చెన్నై మరియు ఐబీఎం (IBM) సంస్థల సహకారంతో లక్షలాది మందికి క్వాంటం రంగంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు:
క్వాంటం సాంకేతికత ద్వారా ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన మరియు లాజిస్టిక్స్ రంగాల్లో భారీ మార్పులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారుతాయని, క్లైమేట్ మోడలింగ్ వంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
ఆర్టీఐహెచ్ (RTIH) ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రం కేవలం సాంకేతికతను అనుసరించడమే కాకుండా, కొత్త ఆవిష్కరణలకు చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.




