Pithapuram: ఇక విద్యుత్ బిల్లుల భారం ఉండదు.. లబ్ధిదారులకు వరం సూర్య ఘర్

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరులో 'ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన'ను కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 6:01 PM IST
Pithapuram
X

Pithapuram: ఇక విద్యుత్ బిల్లుల భారం ఉండదు.. లబ్ధిదారులకు వరం సూర్య ఘర్

Pithapuram: ST ,SC విద్యుత్ వినియోగదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సోలార్ విద్యుత్తు పథకాన్ని వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ తెలియజేశారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో STSC విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ విద్యుత్ ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినది.

ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాకినాడ కలెక్టర్ హరేందిరా ప్రసాద్ హాజరయ్యారు అతిథులుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కమిటీ సభ్యులు పెండం దొరబాబు తుమ్మల రామస్వామి ఓదూరి కిషోర్ హాజరయ్యారు ముందుగా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఉచిత సోలార్ పథకాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం లబ్ధిదారులతో జరిగిన సభలో కలెక్టర్.హరేందిరా ప్రసాద్ పెండెం దొరబాబు తుమ్మల రామస్వామి ఓదూరి కిషోర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు వెన్న జగదీష్, తుమ్మల బాబు, రాయుడు రాజు ,వీరంరెడ్డి చిన్న పిల్లా శివశంకర్ రెడ్డెం జనార్దన్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story