Himanshu Shukla: మజ్జిగ పంపిణీతో ఉపశమనం.. కలెక్టరేట్ లో చలివేంద్రం షురూ!

Himanshu Shukla: వేసవి ఎండల దృష్ట్యా ప్రజలకు తాగునీరు అందించేందుకు కలెక్టరేట్ వద్ద చలివేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు.

V. Narasimhulu, Nellore
Published on: 16 April 2026 6:26 PM IST
Himanshu Shukla
X

Himanshu Shukla: మజ్జిగ పంపిణీతో ఉపశమనం.. కలెక్టరేట్ లో చలివేంద్రం షురూ!

Himanshu Shukla: ప్రస్తుతం ఎండలు అధికంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ప్రజలకు తాగునీరు అందించడం అత్యంత అవసరం అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా గ్రామీనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఎదుట వేసవిని ద్రుష్టి లో పెట్టుకొని చలివేద్రం ఏర్పాటు చేసిన డిఆర్డీఏ కు నా అభినందనలు.ఈ రోజు చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. చలివేంద్రాలు ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. వడదెబ్బకు ప్రజలు గురికాకుండా నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలి వేసవి తీవ్ర దృష్ట్యా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటికి రావాలి. టోపీలు లేదా గొడుగులు దగ్గర ఉంచుకోవాలి. తమ వెంట తప్పనిసరిగా వాటర్ బాటిల్ ఉంచుకోవాలి. బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి అన్నారు.

స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు ముందుకు వచ్చి మజ్జిగ అందిస్తూ చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, అన్ని వాటర్ స్కీమ్స్ సక్రమంగా పనిచేసేలా అధికారులుఅవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు పలువురికి చలివేద్రం లో ఏర్పాటు మజ్జిగను అందచేసారు. త్రాగునీటిని స్వయంగా గ్రాసులో పట్టుకొని త్రాగారు. ఈ కార్యక్రమములో డి.ఆర్.డి.ఎ పి.డి నాగ రాజ కుమారి, వారి సబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story