Rampachodavaram: రంపచోడవరంలో జాతీయ ఏక్తా దివస్ వేడుకలు!

Rampachodavaram: జాతీయ ఏక్తా దివస్ సందర్భంగా రంపచోడవరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5కే రన్. ప్రారంభించిన పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్

Prasanna, Rampachodavaram
Published on: 31 Oct 2026 8:53 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరంలో జాతీయ ఏక్తా దివస్ వేడుకలు!

Rampachodavaram: జాతీయ ఏక్తా దివస్‌ ను పురస్కరించుకుని పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శనివారం 5కె రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి జాగరంపల్లి వరకు ఈ పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

5కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు, విద్యార్థుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ బహుమతులను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతదేశ సమగ్రత, ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని కొనియాడారు.

ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఏక్తా దివస్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, జిల్లాపోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram