గోదావరి ఒడ్డున 'డెస్టినేషన్ యోగా'.. కోనసీమ అందాలను ప్రపంచానికి చాటేలా సరికొత్త ప్రయోగం!
Konaseema: కోనసీమ జిల్లా దిండి హరిత రిసార్ట్స్‌లో 'డెస్టినేషన్ యోగా' వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరి నదీ తీరం యోగా సాధనకు ఎంతో అనువుగా ఉందని, పర్యాటక రంగ ప్రమోషనే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
మలికిపురం: మల్కిపురం జూన్10 భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద, జీవన విధానం యోగ అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని డెస్టినేషన్ యోగా కార్యక్ర మాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో దిండి హరిత రిసార్ట్స్ నందు ఘనంగా నిర్వ హిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణం లో డెస్టినేషన్ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడు తుందన్నారు యోగా సాధనకు యోగా నేర్చు కోవడానికి సాధన చేయ డానికి గోదావరి నది తీరం ఎంతో అనువుగా ఉంద న్నారు. ప్రకృతి ఒడిలో యోగా సాధన ద్వారా శరీరంలో ప్రాణశక్తి పెరు గుతుందన్నారు.
యోగా లోని ఆసనాలు, ప్రాణా యామం, ధ్యానం అనేవి ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు.ప్రముఖ పర్యాటక, ప్రకృతి రమణీ యమైన చారిత్రక ప్రాధా న్యత కలిగిన ప్రదేశాలను యోగ కొరకు ఎంపిక చేయ డం జరిగిందన్నారు ప్రజల్లో శారీరక, మానసిక ఆరో గ్యంపై అవగాహన పెంచ డంతోపాటు, పర్యాటక రంగ ప్రాధాన్యత ను ప్రపంచానికి చాటిచెప్పడ మే ఈ డెస్టినేషన్ యోగా ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఒత్తిడి లేని జీవన శైలికి యోగా ఎంతో దోహదపడు తుందన్నారు ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యా ర్థులు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ డెస్టినేషన్ యోగాను విజయవంతం చేశారన్నా రు. ప్రభుత్వం యోగాను ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో యోగ ఆంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి శారీ రక దృఢత్వం మానసిక ప్రశాంతతపై అవగాహన పెంచాలని ప్రభుత్వం ల క్ష్యంగా పెట్టుకుందన్నారు యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయా లని పిలుపునిచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోo నైదియాదేవి ప్రసంగిస్తూ మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం ఆరోగ్య కరమైన జీవనశైలికి యోగా ఒక అద్భుతమైన మార్గమన్నా రు. యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుం డా, ప్రతి ఒక్కరి దైనందిన జీవితం లో భాగంగా చేసు కోవాల న్నారు జూన్ 7 నుండి 21 వరకు అంత ర్జాతీయ యోగా దినోత్స వంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా కార్యక్ర మాలు నిర్వహిస్తు న్నామన్నారు.ఆరోగ్యవంత మైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమన్నారు. ప్రతి వయస్సు వారూ యోగాను ఆచరించాలన్నారు.
నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవ డం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందు తాయన్నారు ప్రపంచ వ్యా ప్తంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనల నేపథ్యంలో యోగా అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా గుర్తింపు పొందిందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇతరులను జయించడం కంటే మనల్ని మనం జయించుకోవడం గొప్ప విజయమని, అందు కు యోగా, ధ్యానం ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. యోగా శ్వాసకోశ వ్యవ స్థను బలోపేతం చేయడం తో పాటు రోగనిరోధక శక్తిని పెంచి ఆధునిక జీవనశైలి లో వచ్చే అనేక వ్యాధు లను దూరం చేస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ శ్యాంసుందర్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్ హుస్సేన్ జిల్లాస్థాయి అధికారులు ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




