Nellore: ఇళ్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. లోన్ల పేరుతో భారీ కుంభకోణం

Nellore: నెల్లూరు జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మరియు ఏజెంట్లు కుమ్మక్కై యానాదులను మోసం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.

V. Narasimhulu, Nellore
Published on: 17 April 2026 6:44 PM IST
Nellore
X

Nellore: ఇళ్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. లోన్ల పేరుతో భారీ కుంభకోణం

Nellore: SC,ST స్పెషల్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కి యానాదుల సంక్షేమ సంఘం వినతి పత్రం సమర్పించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఫిన్న్కేర్ బ్యాంకుల వేధింపులనుంచి యానాదులను కాపాడాలని కోరుతూ.. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో SC,ST ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రీవెన్స్ లో గౌరవ జిల్లాకలెక్టర్ హిమాన్షు శుక్లాని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా YRPS రాష్ట్ర అధ్యక్షులు KC పెంచలయ్య యానాది మాట్లాడుతూ.. జలదంకి మండలం, నెహ్రూనగర్ గిరిజన కాలనీ, అప్పారావు కాలనీ,గట్టుపల్లి చింతలపాలెం, తిమ్మసముద్ర, యానాది కాలనీలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు, రెవె న్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధి కారులు మరియు ఏజెంట్లు కుమ్మ క్కై యానాదులకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా

యానాదులను మోసంచేసి మైక్రో ఫైనాన్స్ ల ద్వారా లోన్ తీసుకొని, అందరూపంచుకొని యానాదులను మో సం చేయడంజరిగినదని కలెక్టర్ కి వివరించామని చెప్పారు. అలాగే కావలి, పొదలకూరు, సైదాపురం, మండలాలకు సంబంధించిన యానాదుల భూసమస్యల మీద కలెక్టర్ కి ఫిర్యాదు చేసి వినతి పత్రం సమర్పించామని చెప్పారు.

గౌరవ కలెక్టర్ మైక్రో ఫైనాన్స్ సంస్థల మోసాలపై తీవ్రంగా స్పం దించారని, ITDA, పోలీస్ అధికారులు,.రెవెన్యూ అధికారులు,.సమగ్ర విచారణ జరిపి రెండురోజుల్లో నివే దిక ఇవ్వాలని కోరారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మాకాని రవీం ద్రబాబు, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తూరు శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు యల్లంపల్లి శీనయ్య, ఆయా కాలనీల యానాదులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story