Gorantla: వీర జవాన్ మురళి నాయక్ నివాళులు అర్పించిన కలెక్టర్
Gorantla: గోరంట్ల మండలం కల్లి తండాలో వీర జవాన్ మురళి నాయక్ మొదటి వర్ధంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ శ్యాం ప్రసాద్ హాజరై నివాళులర్పించారు.
Gorantla: వీర జవాన్ మురళి నాయక్ నివాళులు అర్పించిన కలెక్టర్
Gorantla: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పరిధిలో ఉన్న కల్లి తండాలో అగ్ని వీర్ మురళి నాయక్ గాట్ వద్ద మొదటి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం ఆపరేషన్ సింధూర్ లో దేశం కోసం ప్రాణాలర్పించిన జ్యోతిబాయ్ శ్రీరామ్ నాయక్ ఏకైక పుత్రుడు మురళి నాయక్ ప్రాణాలర్పించి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా వారి స్వగ్రామంలో పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సినీ నిర్మాత జిఎం శేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అదేవిధంగ మురళి నాయక్ ఇంటి దగ్గర అరోమా ఆస్పత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




