Amalapuram: ప్లాస్టిక్ వాడితే ఇక అంతే కలెక్టర్ మహేష్ కుమార్ కఠిన ఆదేశాలు

Amalapuram: అమలాపురం రైతు బజార్ వద్ద 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం ఘనంగా జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 16 May 2026 4:48 PM IST
Amalapuram
X

Amalapuram: ప్లాస్టిక్ వాడితే ఇక అంతే కలెక్టర్ మహేష్ కుమార్ కఠిన ఆదేశాలు

అమలాపురం: ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన డాక్టర్..బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రైతు బజార్ వద్ద స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ వార్డు మెంబర్లు పాల్గొని ప్లాస్టిక్ రహిత జిల్లా ఇతివృత్తంగా చేపట్టి ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గత 16 నెల లుగా ప్రతీ నెలా మూడో శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే

ఈకార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి, భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని కోనసీమను అందిద్దామని కోరారు.​ కోనసీమ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం కావాలన్నారు ​ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ జెండాలు మరియు ఫ్లెక్సీల వాడకంపై జిల్లా వ్యాప్తంగా పూర్తి నిషేధం విధించడమైనదన్నారు.ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో పర్యావరణానికి హితమైన జనపనార జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు, కాగితపు సంచులను వినియోగించాలన్నారు.

జీవవైవిధ్యం మన సంపద కావాలని,. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుంచే మార్పును ప్రారంభించాలన్నారు. దుకాణాలకు వెళ్లే టప్పుడు తప్పనిసరిగా గుడ్డ సంచిని తీసుకెళ్లడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. అందరి సహకారంతో డా..బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ ప్లాస్టిక్ రహిత జిల్లాగా నిలుపుకుందామన్నారు.

అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు ప్రసంగిస్తూ.. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన మన కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. గత 30 సంవత్సరాల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు క్లీన్ అండ్ గ్రీన్ పేరిట పరిసరాల పరిశుభ్రత పచ్చదనం పెంపుదలకు నాంది పలికారని ప్రస్తుతం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పేరిట పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి, భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని కోనసీమను అందిద్దామన్నారు.

​ఈ సందర్భంగా పురపాలక యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని, ప్లాస్టిక్ రహిత జిల్లాగా కోనసీమను తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు అల్లాడ స్వామి నాయుడు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, నాయకులు రాజా బీ వెంకటరమణ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story