Kanchili: జలధార-జలహారతితో సాగునీటి వనరుల అభివృద్ధి.. కలెక్టర్

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని గంగాసాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు పరిశీలించారు.

G.RAMBABU, SOMPET
Published on: 18 April 2026 5:23 PM IST
Kanchili
X

Kanchili: జలధార-జలహారతితో సాగునీటి వనరుల అభివృద్ధి.. కలెక్టర్

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార-జలహారతి కార్యక్రమం కింద నీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపుపై చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.

ఈ క్రమంలో కంచిలి మండలం జలంత్రకోట గ్రామ పరిధిలోని గంగాసాగర్ ప్రాజెక్టును కలెక్టర్, ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ సామర్థ్యం, వినియోగ విధానం, పరిసర ప్రాంతాలపై ప్రభావం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

అధికారుల వివరాల ప్రకారం, సుమారు 0.4 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ట్యాంకును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే పరిసర ప్రాంతాల తొమ్మిది చెరువులను నింపే అవకాశం ఉందని తెలిపారు. దీని ద్వారా సాగునీటి అందుబాటు పెరిగి భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story