Markapuram: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం.. కలెక్టర్
Markapuram: మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు.
Markapuram: అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం.. కలెక్టర్
Markapuram: మార్కాపురం లో మంగళవారం నిర్వహించిన అగ్గిమాపక వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందర్భంగా వారోత్సవాలను ప్రారంభించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈనెల 23 వరకు వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
వేసవిలో ప్రమాదాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు, ఇతర మండే పదార్థాలకు దూరంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా వంటింట్లో గాలి వెళుతురు ఉండే విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్యాస్ లీకలపై అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను అరికట్టుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి వారోత్సవాల పోస్టర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం అగ్గిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




