Nandikotkur: జైన్ పరిశ్రమను ముట్టడిస్తాం.. సీపీఐ నేత హెచ్చరిక!

Nandikotkur: జూపాడు బంగ్లాలోని తంగడంచ ఫారంలో ఉన్న జైన్ పరిశ్రమ స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని సీపీఐ నేత ఎం. రమేష్ బాబు మండిపడ్డారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 19 April 2026 9:13 PM IST
Nandikotkur
X

Nandikotkur: జైన్ పరిశ్రమను ముట్టడిస్తాం.. సీపీఐ నేత హెచ్చరిక!

Nandikotkur: అభివృద్ధి చేయకపోతే భూములు అప్పగించండి.. ఓర్వకల్లు తప్ప తంగడంచ భూముల అభివృద్ధి పట్టదా.. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు హెచ్చరిక.. జూపాడు బంగ్లాలోని తంగడంచ ఫారం విలువైన భూముల్లో 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన జైన్ పరిశ్రమ నేటికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఈ ప్రాంత నిరుద్యోగులకు ఒక్కరి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని.

75% ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం ప్రారంభంలో హామీ ఇచ్చారని అయితే ఆ హామీని అమలు చేయడంలో పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా విఫలం చెందిందని తక్షణమే నందికొట్కూరు నియోజకవర్గ యువతకు జైన్ పరిశ్రమను అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వందలాది మంది నిరుద్యోగుల తో కంపెనీ ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం.రమేష్ బాబు హెచ్చరించారు.. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మండల నాయకులు మక్బూల్ బాషా,,రాజులతో కలిసి మాట్లాడారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story