Bhimavaram: రైతులపై కేసులా? మట్టి మాఫియాకు పోలీసుల వత్తాసుపై జిల్లాలో నిరసన
Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని నక్కల కాలువలో అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ డిమాండ్ చేశారు.
Bhimavaram: రైతులపై కేసులా? మట్టి మాఫియాకు పోలీసుల వత్తాసుపై జిల్లాలో నిరసన
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పరిధిలోని నక్కల కాలువలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను జిల్లా యంత్రాంగం తక్షణమే అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం భీమవరంలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ మాట్లాడారు.
మట్టి మాఫియా ఆగడాలు గత కొన్ని రోజులుగా నక్కల కాలువలో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలను (జెసిబిలు) ఉపయోగించి అక్రమంగా మట్టిని తవ్వుకుని అమ్ముకుంటున్నారు., దీనివల్ల కాలువ గట్లు బలహీనపడే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. మట్టి మాఫియాకు కొమ్ముకాస్తూ, హక్కుల కోసం పోరాడే రైతులపై కేసులు పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. కాలువలను ఆధునీకరించడం, పూడిక తీయడం వంటి పనులు సంబంధిత ప్రభుత్వ శాఖలు (రెవెన్యూ, ఇరిగేషన్) చేయాలే తప్ప, ప్రైవేటు వ్యక్తులు తమ స్వలాభం కోసం కాలువలను నాశనం చేయకూడదని వారు స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్, ఆర్.డి.ఓ, ఎమ్.ఆర్.ఓ మరియు ఇరిగేషన్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ మట్టి రవాణాను ఆపాలి.కాలువ గట్లను పటిష్టం చేసి, భవిష్యత్తులో గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. అరెస్టయిన రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఒకవేళ అధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయకపోతే, రైతులతో కలిసి సీపీఐ(ఎం) పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పార్టీ జిల్లాకార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ హెచ్చరించారు.




