Cyclone Akvan Alert: పోలవరం జిల్లాకు తుఫాను ముప్పు.. 4 రోజులు భారీ వర్షాలు!

Cyclone Akvan Alert: అక్వాన్ తుఫాను ప్రభావంతో పోలవరం జిల్లాలో నవంబర్ 17 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Nov 2026 5:16 AM IST
Cyclone Akvan Alert
X

Cyclone Akvan Alert: పోలవరం జిల్లాకు తుఫాను ముప్పు.. 4 రోజులు భారీ వర్షాలు!

Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫానుకు 'అక్వాన్‌'గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాను రానున్న రోజుల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ సూచించారు. అక్వాన్ తుఫాను ప్రభావంతో నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు!

భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కలెక్టర్ సూచించారు. వాగులు, వంకలు, కాజ్వేలు పొంగిపొర్లుతున్నప్పుడు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గోదావరి, శబరి, సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ప్రజలు ఏదైనా అత్యవసర సహాయం అవసరమైనప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-4225ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో అధికారులు జారీ చేసే సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్