Cyclone Akwan: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. శుక్రవారం తీరం దాటే అవకాశం!

Cyclone Akwan: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Cyclone Akwan) తుపాను క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 4:23 PM IST
Cyclone Akwan
X

Cyclone Akwan: ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. శుక్రవారం తీరం దాటే అవకాశం!

Cyclone Akwan: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Cyclone Akwan) తుపాను క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతానికి ఇది దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ఇవాళ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

తుపాను ప్రస్తుత స్థితి, దూరం వివరాలు:

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం అక్వాన్ తుపాను వివిధ ప్రాంతాలకు ఈ కింది దూరంలో కేంద్రీకృతమై ఉంది.

చెన్నైకి: 600 కిలోమీటర్లు

మచిలీపట్నానికి: 650 కిలోమీటర్లు

విశాఖపట్నానికి: 660 కిలోమీటర్లు

గోపాల్‌పూర్ (ఒడిశా)కు: 780 కిలోమీటర్లు

శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం!

పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తున్న ఈ తుపాను, ఎల్లుండి (గురువారం) ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మరింత బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది శుక్రవారం మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.