Cyclone Arnab: ఏపీపై 'అర్నబ్' తుపాను పంజా.. బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం!
Cyclone Arnab: బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాను తీవ్రరూపం దాల్చింది.
Cyclone Arnab: ఏపీపై 'అర్నబ్' తుపాను పంజా.. బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం!
Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి ‘అర్నబ్’ తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గడిచిన 6 గంటల వ్యవధిలో ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ‘అర్నబ్’ తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు మరియు బాపట్లకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తీరం దాటే సమయం – తీవ్రత:
సోమవారం అర్ధరాత్రి ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చి అతి తీవ్ర తుపానుగా మారనుంది. బుధవారం ఉదయం బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు:
తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉనందున విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సోమ, మంగళ, బుధవారాల్లో (మూడు రోజుల పాటు) ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని తీరప్రాంత యంత్రాంగం స్పష్టం చేసింది.




