Madakasira: ఒకే బైక్‌పై ఆరుగురు.. ఇది సాహసమా? మూర్ఖత్వమా?
Madakasira: మడకశిరలో ఒకే బైక్‌పై ఆరుగురు ప్రయాణిస్తూ కలకలం రేపారు. కర్ర సాయంతో చిన్నారులను కూర్చోబెట్టి చేసిన ఈ ప్రమాదకర ప్రయాణంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Madakasira: ఒకే బైక్‌పై ఆరుగురు.. ఇది సాహసమా? మూర్ఖత్వమా?
Madakasira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. ఒకే ద్విచక్ర వాహనంపై ఆరుగురు ప్రయాణించడం స్థానికులను షాక్‌కు గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి ఎక్సెల్ ద్విచక్ర వాహనానికి అదనంగా కర్రను అమర్చి, ఆ కర్రపై ఇద్దరు చిన్నారులను కూర్చోబెట్టి ప్రయాణం సాగించాడు. అదే వాహనంపై మొత్తం కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణించడం గమనార్హం.
ఈ ప్రమాదకర దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలను పూర్తిగా విస్మరించి ఇలాంటి సాహస యాత్ర చేయడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని వారు హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఎప్పుడైనా దుర్ఘటన జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




