Santanuthalapadu: ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారిపై మృత్యుపాశాలు.. కలెక్టర్‌కు మొరపెట్టుకున్న సంతనూతలపాడు గ్రామస్తులు

Santanuthalapadu: సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 11 May 2026 5:55 PM IST
Santanuthalapadu
X

Santanuthalapadu: ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారిపై మృత్యుపాశాలు.. కలెక్టర్‌కు మొరపెట్టుకున్న సంతనూతలపాడు గ్రామస్తులు

సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా): ప్రమాదకరంగా మారిన ఒంగోలు కర్నూల్ ప్రధాన రహదారి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ కు 20 మీటర్ల దూరంలో ప్రధాన రహదారిపై గోతులు. సంతనూతలపాడు గ్రామ పెద్ద చెరువు కట్టకు చిన్న రంధ్రం పడటం వల్ల రెండు పక్కల సన్న లీకేజ్ అవుతుంది. ఒంగోలు కర్నూల్ ప్రధాన రహదారిలో నిత్యం వేల సంఖ్యలో రద్దీగా పెద్దపెద్ద వాహనాలు తిరుగుతూ ఉంటాయి చెరువు కట్ట చెరువు భాగం వేల ఎకరాల వ్యవసాయం పండిస్తుంటారు రైతులు.

కానీ గత రెండు నెలల నుంచి మండల స్థాయి అధికారులకు ఎన్నిసార్లు ప్రజలు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవు . ఈరోజు కొంతమంది గ్రామస్తులు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ను కలిశారు ప్రస్తుత పరిస్థితిని వివరించారు కలెక్టర్ స్పందిస్తూ రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తానని ప్రజల ప్రాణాలకు దిగువ ఉన్న పంటకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story