Dharmavaram: కూటమి ప్రభుత్వ చొరవ.. నిలిచిపోయిన టిడ్కో ఇళ్లకు మోక్షం
Dharmavaram: ర్మవరం కేతిరెడ్డి కాలనీ వద్ద నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించింది.
Dharmavaram: కూటమి ప్రభుత్వ చొరవ.. నిలిచిపోయిన టిడ్కో ఇళ్లకు మోక్షం
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం మళ్లీ పునః ప్రారంభించింది. 2014 2019 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ధర్మవరం నుండి ఎన్ ఎస్ గేట్ కు వెళ్లే రహదారి కేతిరెడ్డి కాలనీ వద్ద ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. 2019 లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి.
కూటమి ప్రభుత్వం జూన్ నెల లోపల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించడంతో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యం విద్యుత్తు వంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది.నిర్మాణాలు పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు ఒకేసారి పంపిణీ చేసి గృహప్రవేశం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.




