Dharmavaram: ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Dharmavaram: ధర్మవరం నియోజకవర్గంలో 14 మందికి రూ. 5.19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పరిటాల శ్రీరామ్.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 13 April 2026 7:45 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం పట్టణం,తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం రూరల్ మండలాలకు చెందిన 14మందికి రూ.5.19లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు సాయం అందుతోంది.ఎన్టీఆర్ వైద్య సేవలు అందని సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నాము. ఈ 22నెలల కాలంలోనే ధర్మవరం నియోజకవర్గంలో 359మందికి 2.34కోట్ల రూపాయల మేర సాయం అందించాము. ఎన్టీఆర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని శ్రీరామ్ అన్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM

Next Story