Dindi: దిండి-చించినాడ వశిష్ఠ వారధిపై పునఃప్రారంభమైన రాకపోకలు!
Dindi: దిండి-చించినాడ వశిష్ఠ వారధిపై రోడ్డు నిర్మాణ పనులు పూర్తవడంతో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి వాహనాలను అనుమతించారు.
Dindi: దిండి-చించినాడ వశిష్ఠ వారధిపై పునఃప్రారంభమైన రాకపోకలు!
Dindi: దిండి-చించినాడ వశిష్ఠ వారధిపై అభివృద్ధి పనుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు బిటుమన్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం వారధిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావడంతో శుక్రవారం ఉదయం నుండి యథావిధిగా రాకపోకలను అనుమతించారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.




