Markapur: దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డుపై కారు ప్రమాదం!
Markapur: దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డుపై వీరకొండ వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Markapur: దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డుపై కారు ప్రమాదం!
Markapur: మార్కాపురం జిల్లా దోర్నాలశ్రీశైలం ఘాట్ రోడ్డుపై తుమ్మలబైలు సమీపంలోని వీరకొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదంతో ఘాట్ రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.




