Nellore: హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం

Nellore: హిందూ దేవుళ్లపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులో శివాజీ సేన ఆందోళన. ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన చత్రపతి శివాజీ సేన నాయకులు.

V. Narasimhulu, Nellore
Published on: 19 April 2026 11:35 AM IST
Nellore
X

Nellore: హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం

Nellore: సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నిరసిస్తూ నెల్లూరు లో శివాజీ సేన ఆందోళన చేసింది. ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. దిష్టిబొమ్మను శవయాత్రగా ఊరేగించారు.. పిఆర్సీ సెంటర్లో ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా హిందూ సేన నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ సేన నాయకులు న్యాయవాది కాకు మురళి రెడ్డి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

జై శ్రీరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఒకరకంగా చెప్పాలంటే హిందువులు గాయపడినటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపడతూ ఉన్నామని చెప్పారు.. ఎందుకంటే ఇటీవల కాలంలో హిందూ దేవతల పైన హేళన చేయడం జరుగుతోందని తెలిపారు.. సమాజంలో ఒక ద్రోహిగా, సమాజ వ్యతిరేక శక్తిగా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ , రామలక్ష్మణుల పైన, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహాకావ్యమైన రామాయణ గ్రంథం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం అన్నారు.

ప్రకాష్ రాజ్ తల్లి ఎందుకు మరణించారు అంటే.. ఇతను క్రైస్తవ్యం లో పుట్టి పైకి క్రైస్తవుడని చెప్పుకోలేక, నాస్తికుడిని అని చెప్పుకుంటూ.. జీవిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ ప్రవర్తన చూడలేక మరణించింది.. అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హిందూ మతం పట్ల, దేవుళ్ళ పట్ల ప్రకాష్ రాజ్ తన విధానాన్ని మార్చుకోకపోతే, శివాజీ సేన నుంచి ముప్పు ఎదుర్కోక తప్పదంటూ హెచ్చరికలు చేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story