Nandyal: నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలకు చెక్.. ఎస్పీ అజిత వేజెండ్ల చొరవ!
Nandyal: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం “ఫేస్ వాష్ అండ్ గో”.
Nandyal: నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలకు చెక్.. ఎస్పీ అజిత వేజెండ్ల చొరవ!
Nandyal: జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహణ చేపట్టారు– జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల. జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి. (అడ్మిన్) CH. సౌజన్య సూచనలతో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, రాత్రి వేళల్లో ప్రయాణించే ట్రావెల్స్ బస్సులు, లారీలు మరియు ఇతర వాహనాలను పోలీసులు ఆపి, డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించేలా సూచనలు అందిస్తున్నారు.
నిద్రమత్తు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు డ్రైవర్లలో భద్రతా అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని చెప్పారు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల. టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లు అలసటగా అనిపించినప్పుడు వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. నిర్దేశిత వేగ పరిమితులు (Speed Limits) తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.




