పండుగ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు..

దసరా, దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా తీవ్రమయ్యే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం

G Krishna
Published on: 3 Oct 2026 2:09 PM IST
special Trains
X

special Trains

దసరా, దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా తీవ్రమయ్యే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు, చర్లపల్లి, తిరుపతి, విజయపుర, తిరువన్నామలై మార్గాల్లో గుంతకల్లు , గుత్తి మీదుగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శనివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇదే సమయంలో ట్రాక్ రెన్యువల్ పనుల కారణంగా ఒక మెము రైలు పాక్షిక రద్దుతో పాటు, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు నూతన స్టాపింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.

బెంగళూరు - చర్లపల్లి వీక్లీ స్పెషల్ ట్రైన్లు

బెంగళూరు , చర్లపల్లి మధ్య ప్రయాణించే వారి కోసం ప్రత్యేక రైలు సర్వీసును నడుపుతున్నారు. చర్లపల్లి - బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు (నం. 07065) ఈ నెల 5, 12, 19, 26 , వచ్చే నవంబరు 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు - చర్లపల్లి ప్రత్యేక రైలు (నం. 07066) ఈ నెల 6, 13, 20, 27 , అక్టోబరు 3, 10, 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, సేడం, యాద్గిర్‌, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్ల మీదుగా నడుస్తుంది.

బెంగళూరు మెము రైలు 11 రోజుల పాటు పాక్షిక రద్దు

రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల భాగంగా రంగేపల్లి - పెనుగొండ సెక్షన్ మధ్య ట్రాక్ రెన్యువల్ పనులు చేపట్టనున్నారు. ఈ కారణంతో బెంగళూరు - అనంతపురం మధ్య నడిచే మెము ప్యాసింజరు (నం. 66559/60) రైలును విడతలవారీగా 11 రోజుల పాటు పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23, 25, 28 తేదీలలో ఈ రైలు బెంగళూరు - హిందూపురం సెక్షన్ మధ్య నడవదు. కేవలం హిందూపురం - అనంతపురం సెక్షన్ మధ్య మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

తిరుపతి - విజయపుర ప్రత్యేక రైలు సర్వీసు

రాయలసీమ నుంచి కర్ణాటక వెళ్లే భక్తులు, ప్రయాణికుల కోసం తిరుపతి - విజయపుర మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. తిరుపతి - విజయపుర ప్రత్యేక వీక్లీ రైలు (నం. 07419) ఈ నెల 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి అదే రోజు రాత్రి 10.25 గంటలకు విజయపుర చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (నం. 07420) ఆదివారం రాత్రి 11.35 గంటలకు విజయపురలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోసపేట, కొప్పల్‌, గదగ్‌, హోలే ఆలూరు, బాదామి, బాగల్‌కోట్‌, ఆల్మట్టి, బసవన బాగేవాడి రోడ్‌ స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంది.

చర్లపల్లి - తిరువన్నామలై ఏడు ట్రిప్పుల స్పెషల్ ట్రైన్

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి - తిరువన్నామలై (వయా గుత్తి) మధ్య ఏడు ట్రిప్పుల అప్ అండ్ డౌన్ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. చర్లపల్లి - తిరువన్నామలై ప్రత్యేక రైలు (నం. 07003) ఈ నెల 6వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకు మంగళవారాల్లో ఏడు ట్రిప్పులు తిరుగుతుంది. తిరుగు ప్రయాణంలో (నం. 07004) ఈ నెల 7 నుంచి నవంబరు 18వ తేదీ వరకు బుధవారాల్లో ఏడు ట్రిప్పులు నడుస్తుంది. ఈ సర్వీసు కాచిగూడ, మహబూబ్‌‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కడప స్టేషన్ల మీదుగా సాగుతుంది.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు నందలూరులో కొత్త స్టాపింగ్

వైఎస్‌ఆర్ కడప జిల్లా నందలూరు ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కాచిగూడ - చిత్తూరు - కాచిగూడ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ (నం. 12797/98) కు నందలూరు స్టేషన్‌లో కొత్తగా స్టాపింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ నెల 3వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నందలూరు స్టేషన్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.