Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్!
Chandrababu: ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలకు చెక్ పెడుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్!
AP Dharani Rice Price: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పండగ పూట తీపి కబురు అందించారు. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు.
మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్న వేళ, నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకే ప్రజలకు అందించేందుకు 'ధరణి' బ్రాండ్ విక్రయాలను భారీగా విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ధరణి బియ్యం విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా, నేరుగా ప్రజల వద్దకే సరుకులు చేరేలా ప్రత్యేక మొబైల్ వాహనాలను రంగంలోకి దించుతున్నారు.
సీఎం నిర్ణయించిన బియ్యం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ఫైన్ బియ్యం: కిలో రూ. 49/- మాత్రమే
సూపర్ ఫైన్ బియ్యం: కిలో రూ. 50/- మాత్రమే
బీపీటీ స్టీమ్ బియ్యం: కిలో రూ. 66/- మాత్రమే
మరోవైపు కూరగాయలు, ఉల్లి ధరల మంటను తగ్గించేందుకు ప్రభుత్వం సమరశంఖం పూరించింది. ఉల్లి కొరత రాకుండా కర్నూలు మార్కెట్ నుంచి సరఫరాను తక్షణమే పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే దీపావళి పండుగ నాటికి పంపిణీ ప్రక్రియను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, ఏ ఒక్క సామాన్యుడికీ ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. సామాన్యుడి జేబుకు చిల్లు పడకూడదు... నాణ్యమైన నిత్యావసరాలు సరసమైన ధరలకే అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.




