Markapuram: ఆసుపత్రుల్లో అగ్నిమాపక అవగాహన సదస్సులు.. ప్రత్యేక శిక్షణ
Markapuram: మార్కాపురంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.
Markapuram: ఆసుపత్రుల్లో అగ్నిమాపక అవగాహన సదస్సులు.. ప్రత్యేక శిక్షణ
Markapuram: మార్కాపురంలోని జననీ శ్వాస హాస్పిటల్, ఆరోగ్య హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్ నందు అగ్నిమాపక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుల నందు హాస్పిటల్ భవనము నందు జరుగు అగ్ని ప్రమాదముల గురించి వారికి తెలియజేసి వారు పాటించవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలను వారికి తెలియజేయడం జరిగింది.
హాస్పిటల్స్ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో హాస్పిటల్స్ సిబ్బందికి వారి హాస్పిటల్ నందు గల ఫైర్ Extinguishers మరియు ఇతర అగ్నిమాపక సాధనాలను ఏ విధంగా ఉపయోగించాలో వారికి డెమో ప్రోగ్రాం ద్వారా చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా అనుకోకుండా హాస్పిటల్ నందు ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిని ఏ విధంగా సురక్షిత ప్రాంతానికి తీసుకురావాలో వారికి వివరించడం జరిగింది.
ఎలక్ట్రికల్ ఫైర్ జరగకుండా వారు పాటించాల్సిన ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి హాస్పిటల్ యాజమాన్యం వారికి తెలియజేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సు నందు పాల్గొన్న వారికి పాంప్లెట్స్ ను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కాపురంలో గల హాస్పిటల్స్ లో పాంప్లెట్స్ పంపిణీ చేసి,
హాస్పిటల్ నందు అందరికీ కనపడే విధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలు గల పోస్టర్స్ ను అతికించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు మార్కాపురం అగ్నిమాపక అధికారి రేగలగడ్డ రామకృష్ణ మరియు ఇతర అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగింది.




